సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ గా రానున్న డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి నుంచి కంటెంట్ పరంగా కొత్తగా ఉండే సినిమాలనే చేసుకుంటూ వచ్చాడు. విభిన్న సినిమాలు చేస్తూ తన గుర్తింపునే మార్చుకుంటున్న కళ్యాణ్ రామ్‌లో ఇప్పుడు ఫ్యాన్స్ కొత్త యాక్టర్‌ని చూస్తున్నారు. ఆయన చేసిన అన్ని ప్రయత్నాలూ ఫలించకపోయినా ఐడెంటిటీ మాత్రం స్పెషల్ గానే ఉంది.
బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్, ప్రస్తుతం నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ అనే స్పై థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథ లీకైంది. స్వాతంత్య్రానికి పూర్తం మద్రాస్ ప్రెసిడెన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుందని, అప్పటి గూఢచారి వ్యవస్థ ఎలా ఉండేది? ప్రభుత్వాల పని తీరు ఎలా ఉంటుందనే అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.
అంతేకాదు డెవిల్ స్టోరీ వాస్తవ సంఘటనల్ని ఆధారంగా చేసుకుని రాసుకున్న కథ అని సమాచారం. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ క్యారెక్టర్ లో కనిపించనుండగా, ఓ సీక్రెట్ ని చేధించే క్రమంలో ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తాయని చిత్ర సభ్యులు చెప్తున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో వేగంగా ఉంటుందని, ఇదొక సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.
సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా స్పై మూవీల్లో డిఫరెంట్ సినిమాగా నిలుస్తుందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్ లో జరుగుతుంది. నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టేవిధంగా మేకర్స్ ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట.













