Kalyan Ram: NKR21 కథ ఇదేనా?
డెవిల్(Devil) సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) చేస్తున్న తన 21వ సినిమాను ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun S/o Vyjayanthi) టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అతని పాత్ర చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉండనున్నట్టు సమాచారం.
సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi) ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ఓ చిన్న టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా టైటిల్ ను బట్టి ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని అర్థమవుతోంది.
మూవీలో కళ్యాణ్ రామ్ విజయ్ శాంతి కొడుకుగా కనిపిస్తాడని, తన తల్లికి ఎదురయ్యే సమస్యలను కొడుకు ఎలా సాల్వ్ చేస్తాడనే నేపథ్యంలో సినిమా కథ సాగనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది. సయూ మంజ్రేకర్(Saee Manjrekar) హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలో సోహైల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.













