నందమూరి హీరో మౌనం వెనుకున్న కారణమేంటి?
ఒక వైపు హీరోగా నటిస్తూనే తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. #ఎన్టీఆర్30 కి కూడా ఆయనే నిర్మాత. అయితే కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలేవీ రిలీజ్ కు రాకపోవడమే కాస్త నిరాశ పరుస్తుంది. ఎప్పుడో లాక్ డౌన్ కి ముందే నాలుగు సినిమాలు లైన్ లో పెట్టిన కళ్యాణ్ రామ్ నుంచి ఎందుకనో కానీ సౌండ్ లేదు. ఒక్క సినిమా అప్డేట్ కూడా లేదు.
దీనికి అసలు రీజన్ ఏంటా అన్నది చూస్తే లో ప్రొఫైల్ మెయింటెైన్ చేస్తూ ముందుకెళ్లాలని కళ్యాణ్ రామ్ అనుకుంటున్నాడట. అయితే అసలు సడెన్ గా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్ చేసుకుని, హడావుడి చేస్తుంటేనే జనాలు థియేటర్లకు రావడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఎలాంటి ప్రమోషన్స్, హడావుడి లేకుండా రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుందేమో అనే దిశగా కళ్యాణ్ రామ్ ఆలోచిస్తే మంచిది.













