నందమూరి వారింట పెళ్లి సందడి…
తెలుగు ఇండస్ట్రీలో వరసగా పెళ్లి బాజాలు మోగుతూనే ఉన్నాయి. హీరోలు, హీరోయిన్లు, నటులు ఇంటి వారవుతున్నారు. ఇప్పుడు మరో వారసుడు కూడా పెళ్లి చేసుకున్నాడు. నందమూరి వంశం నుంచి వచ్చిన ఈయన పెళ్లి చాలా సైలెంట్ గా జరిగింది. నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లి హైదరాబాద్ లోనే డిసెంబర్ 18న ఘనంగా జరిగింది. దీనికి నందమూరి కుటుంబ సభ్యులు కొందరు హాజరయ్యారు. బాలయ్య కూడా వచ్చి అబ్యాయికి ఆశీర్వాదాలు అందించారు. అయితే మీడియాలో ఎక్కువగా ఈ పెళ్లి సందడి కనిపించలేదు. కోవిడ్ కారణంగా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే చైతన్య కృష్ణ వివాహ వేడుక జరిగింది. రేఖా వాణితో డిసెంబర్ 6న చైతన్య కృష్ణ నిశ్చితార్థం జరిగింది. రెండు వారాల తర్వాత ఇప్పుడు పెళ్లి తంతు పూర్తయింది. ఈయన నటుడిగా కూడా ఓ సినిమాలో చేసాడు. 2003 సంవత్సరంలో జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమాలో చైతన్య కృష్ణ మరో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ సినిమాల వైపు రాలేదు.
ఈ పెళ్లికి నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన కొడుకు మోక్షజ్ణ వచ్చాడు. వాళ్లతో పాటు ఆయన కూతుళ్లు కూడా వచ్చారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు కూడా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వాళ్ళతో పాటు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.













