కేర్ హాస్పిటల్లో జాయిన్ అయిన బాలకృష్ణ, కుడి భుజానికి ఆపరేషన్…
నందమూరి బాలకృష్ణ కేర్ హాస్పటల్ లో జాయిన్ అయ్యాడంటే అయన అభిమానులకు టెన్షనే టెన్షన్! కానీ జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కు. విషయం ఏమిటంటే? ఆయన కుడి భుజం నొప్పి ఎక్కువ కావడంతో ఈ రోజు ఉదయం ఆయన కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. భుజానికి ఆపరేషన్ చేశారు. కేర్ ఆసుపత్రిలోని డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యుల బృందం నాలుగు గంటల పాటు కుడి భుజానికి ఆపరేషన్‌ను నిర్వహించారు. అయితే ఇదే రోజు సాయంత్రం డాక్టర్స్ ఆయన్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆరు వారాల పాటు ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించడంతో పాటు నందమూరి అభిమానులు టెన్షన్ పడనవరసరం లేదని తెలిపారు.
బాలకృష్ణ ఒకవైపు బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాను పూర్తి చేయగానే తొలిసారి డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో. తన కెరీర్లోనే బాలకృష్ణ తొొలిసారి ఓ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ టాక్ షో పేరు ‘అన్ స్టాపబుల్’. రీసెంట్‌గానే ఆ టాక్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలై అమేజింగ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ షోలో ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. మరో రెండు ఎపిసోడ్స్‌లో ప్రభాస్, తారక్ పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. తొలి ఎపిసోడ్‌ను మంచు మోమన్‌బాబు, విష్ణు, లక్ష్మీ ప్రసన్నలపై చిత్రీకరించారు. అందులో బాలయ్య జోష్ చూసిన ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఈ టాక్ షో ద్వారా సరికొత్త బాలకృష్ణను చూడబోతున్నామని భావించారు.
మరిప్పుడు డాక్టర్స్ బాలకృష్ణకు ఆరువారాల పాటు రెస్ట్ సూచించారు. మరి ఆహా టాక్ షో అన్ స్టాపబుల్‌ను నిర్వాహకులు ఎలా ముందుకు తీసుకెళతారనేది చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన అఖండ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ చిత్రానికి బాలకృష్ణ డబ్బింగ్ పనులు పూర్తి చేశారా? లేక చేయాల్సి ఉందా? అనేది తెలియడం లేదు. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాను నవంబర్లోనే ప్రారంభిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.













