బాలయ్య109 పెద్ద కథలానే ఉంది
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ చేయడంతో ఎంతో జోష్ లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్‌కు, బాలయ్య109 సినిమాను కూడా అనౌన్స్ చేసేసరికి వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
సితార బ్యానర్ కాబట్టి బడ్జెట్‌కు లోటుండదు. త్రివిక్రమ్ సూచనలు, సలహాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. ఈ సినిమాను అనౌన్స్ చేస్తూ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ని రిలీజ్ చేయగా అది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. పోస్టర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమా 1980-90 మధ్య జరిగిన కథగా అనిపిస్తుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండనుంది.
ఒక పాత ట్రంకు పెట్టె, అందులో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్స్, మ్యాన్షన్ హౌస్ మందు, గొడ్డలి, సుత్తి, బుల్లెట్లు ఇలా అన్నీ ఉన్నాయి. అంటే సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ లేదంటే కిల్లర్ అయుండాలి. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ముంబై మ్యాప్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూస్తుంటే బాబీ ఈ సారి బాలయ్య కోసం ఏదో స్టైలిష్ గా, కొత్తగానే ట్రై చేస్తున్నట్లు అనిపిస్తుంది.
సినిమాకు ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేశారు కాబట్టి త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసే ఛాన్సుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి టైమ్ కే సినిమా ఫస్ట్ కాపీని రెడీ చేసేలా ఉన్నాడు బాబీ. మరి సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు రెడీగా ఉండటంతో రిస్క్ చేయకపోవచ్చు. ఇక సంగీత దర్శకుడిగా బాలయ్య థమన్ కు ఓటేస్తాడా, లేక బాబీ డీఎస్పీకి ఓటేస్తాడా అన్నది చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.













