బాలయ్య ‘అఖండ’ పోరాటం
బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న అఖండ సినిమా పతాక సన్నివేశాలు ఇటీవల తమిళనాడులో తెరకెక్కించారు. బాలకృష్ణ ఒంటరిగా బరిలో దిగాడంటేనే వ్యవహారం దబిడి దిబిడి అవుతుంది. ఇక ఇద్దరు బాలయ్యలు కలిసి చేతులు కలిపారంటే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బాలకృష్ణలు కలిసి కనిపించే పతాక సన్నివేశాల్ని, ఆయనతో పాటు ప్రధాన తారాగణంపై తమిళనాడులోని ఓ దేవాలయం నేపథ్యంలో తెరకెక్కించారు. త్వరలోనే మొదలు కానున్న చివరి షెడ్యూల్తో చిత్రం పూర్తవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకి జోడిగా ప్రగ్వా జైశ్వాల్, పూర్ణ నటిస్తున్నారు. శ్రీకాంత్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. తమన్ స్వరకర్త. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత.













