బాలకృష్ణతో పెట్టుకుంటే చాలా డేంజర్ అనిపించేలా బోయపాటి సినిమా!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉండడం సహజమే. ఎందుకంటే ఇంతకుముందు సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్స్ వీరిద్దరి కాంబినేషన్లో రావడంతో మూడో సినిమా కూడా ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేస్తారని అభిమానులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొంతభాగం షూటింగ్ జరిపిన తర్వాత లాక్డౌన్ విధించడంతో షూటింగ్‌కి సంబంధించిన పనులు ఎక్కడివక్కడే ఆపేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చెయ్యాలని బోయపాటి ఆలోచిస్తున్నాడు. కానీ, బాలకృష్ణ అందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాతే షూటింగ్లో పాల్గొనాలని బాలయ్య భావిస్తున్నాడు.
. ఈ నేపథ్యంలో ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అప్డేట్స్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్‌గా బిబి3 అని పెట్టారు. అయితే ఈ సినిమాకి రెండు, మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. మోనార్క్, డేంజర్ అనే టైటిల్స్ః ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలయ్య, బోయపాటి డేంజర్ అనే టైటిల్‌పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో కృష్ణవంశీ డైరెక్షన్లో డేంజర్ అనే టైటిల్‌తో సినిమా వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి 10 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి ఈ టైటిల్‌ను బాలకృష్ణ సినిమాకి తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
బాలకృష్ణతో బోయపాటి గతంలో రూపొందించిన రెండు సినిమాల్లో బాలకృష్ణ క్యారెక్టర్‌ను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించాడో, ఎంత పవర్‌పుల్ డైలాగ్స్ బాలయ్యతో చెప్పించాడో దాన్ని మించే స్థాయిలో ఈ సినిమా డైలాగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. టీజర్లో ఈ సినిమా డైలాగ్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో రుచి చూపించిన బోయపాటి సినిమా ఆద్యంతం ఇలాంటి డైలాగ్స్‌తో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.













