అమూల్యమైన కరోన వ్యాక్సిన్ ప్రక్రియ ను మన వారు అద్భుతంగా నిర్వహిస్తున్నారు : బాలకృష్ణ
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా అనుసరణీయం గా సాగుతోందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను బాలయ్య ఆవిష్కరించారు. తెలుగు ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేస్తూ… ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం పోరాడిన వారి స్ఫూర్తితో సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. సేవభావం ఎన్టీఆర్ కాన్సర్ రోగులకోసం ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి ఆయన నివాళులు అర్పించారు.
3200 మంది చిన్నారులకు గ్రహణ మొర్రి చికిత్స….
మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు విదేశీ ప్రజలకు సైతం ఉపయోగపడుతున్నాయి. ఇటీవల అక్కడి దేశ ప్రధాని మనకు కృతజ్ఞతగా ఆంజనేయుడు సంజీవని పర్వతం ఎత్తుకుని మన దేశం నుండి వారి దేశానికి ప్రయనిస్తున్నట్లు ట్వీట్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోంది. బసవతారకంలోనూ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రహణ మొర్రి ఉన్న 3200 మంది చిన్నారులకు ఉచితంగా చికిత్స చేశాం అని బాలకృష్ణ వెల్లడించారు.













