Meenakshi: సరైన స్క్రిప్ట్ వస్తే బాలయ్యతో సినిమా చేస్తా
హైదరాబాద్ కెపీహెచ్బీ రోడ్ నెం.1 లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హీరో బాలకృష్ణ(Balakrishna), హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) వచ్చారు. మాల్ ఓపెనింగ్ తర్వాత బాలయ్య, మీనాక్షి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలయ్య కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అని తన సినిమాలో ఓ డైలాగ్ ఉంటుందని, అలానే ఇక్కడ ఉన్న ఏ చీర మీనాక్షి వేసుకున్నా ఆ చీరకే అందమొస్తుందన్నారు.
తెలుగు అభిమానులతో పాటూ సినిమాలకు ఎంతో స్పెషాలిటీ ఉందని, ఇప్పటివరకు తాను ఎన్నో సినిమాలు చేశానని అందులో ఆదిత్య 369, భైరవద్వీపంతో పాటూ మరెన్నో జానర్లలో మూవీస్ చేశానని, ఎవరైనా సరే నందమూరి వాళ్లని అనుసరించాల్సిందేనని, మూవీస్ లో ట్రెండ్ సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మేమేనని బాలయ్య అన్నారు.
ఇక మీనాక్షిని బాలయ్య బాబుతో సినిమా చేయరా అని మీడియా వారు అడగ్గా దానికి అమ్మడు సమాధానమిచ్చింది. బాలయ్య సర్ తో కూడా సినిమా చేయాలని తనకు ఉందని, సరైన స్క్రిప్ట్, కరెక్ట్ టైమ్ కు వస్తే మూవీ చేస్తానని, తాను సినిమాలు చేయాలనుకుంటున్న హీరోల లిస్ట్ లో బాలయ్య పేరు కూడా ఉందని మీనాక్షి వెల్లడించింది. ఈ ఇయర్ తనకు చాలా గొప్పగా ప్రారంభమైందని మిగిలిన సంవత్సరం కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నట్టు మీనాక్షి తెలిపింది.













