నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్నడూ లేని ట్వీట్ల మోత

పుట్టిన రోజు సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి కామెంట్
నందమూరి బాలకృష్ణ 61వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో, పేస్ బుక్ లో , ఇంస్టాగ్రామ్ వాట్స్ అప్ గ్రూపుల్లో ఒకటే మోత అదే జై బాలయ్య.. జై జై బాలయ్యా!! అంటూ నేడు బాలయ్య నినాదాలతో మారు మోగుతోంది. ఎప్పుడు ఆయనకు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపని మెయిన్ సెలబ్రిటీస్ ల ట్వీట్ల మోత మోగుతోంది. టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ హీరోలు క్రికెటర్లు, రాజకీయ నాయకులూ, కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఆయన అప్ కమింగ్ మూవీ అప్డేట్స్ కూడా వచ్చేయడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ఫేస్ బుక్, ట్విట్టర్, యూబ్యూబ్‌లలో ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ తరుణంలో దర్శకధీరుడు రాజమౌళి బాలయ్యను ఉద్దేశించి గతంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. దర్శకుడు క్రిష్, రాజమౌళి ముఖాముఖి ఇంటర్వ్యూలో రాజమౌళి బాలయ్యని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే నేడు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇంతకీ అందులో రాజమౌళి ఏమన్నారంటే.. ‘చెన్నకేశవరెడ్డి సినిమా టైంలో దర్శకుడు వి వి వినాయక్ టైం సరిపోక ఒక సాంగ్‌ని షూట్ చేయలేదు. సినిమా విడుదలైన తరువాత రిజల్ట్‌ని బట్టి సాంగ్ యాడ్ చేద్దాం అని అనుకున్నారు. నిజానికి ఆ సినిమాకి ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి కానీ.. వినాయక్ గారు ఆశించనట్టుగా ఔట్ పుట్ రాలేదు. దీంతో ఆయన డిజప్పాయింట్‌గా ఉండి.. యాడ్ చేద్దాం అనుకున్న సాంగ్ షూట్ చాలా డల్‌గా చేస్తున్నారు.
అప్పుడు బాలకృష్ణ గారు పిలిచి “వినాయక్ గారు రిజల్ట్ ఆశించడంలో తప్పులేదు కానీ.. దానిపై ఆశలు పెంచుకోకూడదు. మీరు 100 % కష్టపడ్డారు.. నేను ఎంజాయ్ చేస్తూ చేశా.. మిమ్మల్ని నమ్మి ఈ సబ్జెక్ట్ చేశా.. ఈ సినిమా రిజల్ట్ తరువాత మీపైన అదే గౌరవం.. అదే నమ్మకం ఉంది. మీరు బాధపడొద్దు.. మీరు నాతో మళ్లీ సినిమా చేయాలంటే కథ చెప్పండి చేద్దాం.. అంతే తప్ప బాధ పడొద్దని” చెప్పారట. ఈ విషయాన్ని వినాయక్ చాలా ఎమోషనల్‌గా చెప్పారు. బాలకృష్ణ గారు చాలా గ్రేట్.. ఒక దర్శకుడికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇస్తారు. విగ్ బాలేదన్నా.. షర్ట్ బాలేదన్నా.. తీసి పక్కనపెట్టేస్తారు. దర్శకుడు ఏది చెప్తే అది చేస్తారు రెండో మాట ఉండదు అంటూ బాలయ్య గురించి వినాయక్ చెప్తుంటే నేను ఎమోషనల్ అయ్యా అన్నారు రాజమౌళి..