కేవలం బాలయ్య ఇంట్రో కోసం అంత ఖర్చా?
నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను ల కాంబినేన్లో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక పాత్రలో ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనుండగా మరో పాత్రలో అఘోరాగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో బాలయ్య పంచెకట్టులో అదిరిపోయాడు. సమ్మర్ కానుకగా మే 28న విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను సినిమాకు టైటిల్ గా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య ఇంట్రోని బోయపాటి భారీ రేంజ్ లో ప్లాన్ చేశాడట. దీని కోసం దాదాపు రెండున్నర కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బోయపాటి తన సినిమాల్లో ఫాలో అయినట్లుగా ఇందులో కూడా లేడీస్ ఎక్కువగా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. సినిమాలో బాలయ్య సరన సయేషా సైగల్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు థమన్ సంగీతమందిస్తున్నారు. సింహా, లెజెండ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అందరూ భారీ ఆశలే పెట్టుకున్నారు.













