SSMB29: రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ నటుడు

ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కనీసం అనౌన్స్‌మెంట్ కూడా లేకుండా సైలెంట్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా షూటింగ్ ను చాలా ఫాస్ట్ గా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
అందులో భాగంగానే ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేశాడు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులతో పాటూ మూవీ సర్కిల్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రాజమౌళి భారీ క్యాస్టింగ్ ను సెలెక్ట్ చేశాడు.
అయితే ఎవరైనా సరే రాజమౌళి సినిమా చిన్న ఛాన్స్ వచ్చినా దాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇప్పుడో బాలీవుడ నటుడికి ఎస్ఎస్ఎంబీ29(SSMB29)లో భారీ ఆఫర్ వచ్చినా దాన్ని అతను రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్(Nana Patekar) ను ఎస్ఎస్ఎంబీ29లోని ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి అండ్ టీమ్ అప్రోచ్ అవగా ఆ పాత్ర ఆయనకు నచ్చకపోవడంతో దాన్ని ఆయన సున్నితంగానే తిరస్కరించాడని తెలుస్తోంది. రాజమౌళి ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో ఆయన పేరు బాలీవుడ్ లో తెగ వినిపిస్తోంది.