స్వామిజీ ఆశీస్సులు అందుకున్న రజనీకాంత్
ఇటీవల అనారోగ్యానికి గురైన రజనీకాంత్ తాజాగా నమో నారాయణస్వామి ఆశీస్సులు అందుకున్నారు. స్వామిజీ స్వయంగా పోయేస్ గార్డెన్లోని రజనీకాంత్ ఇంటికి వచ్చి ఆయనతో అరగంట సేపు ముచ్చటించారు. పలు విషయాలపై వీరిద్దరూ ముచ్చటించుకున్నట్టు తెలుస్తుంది. వెళ్లేముందు రజనీకాంత్ దంపతులకు ఆశీస్సులు అందించారు. అనారోగ్యానికి గురైన తర్వాత రజనీని పరామర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని మక్కల్ మండ్రం వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో స్వామిజీ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది. అన్నాతై చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్కు వచ్చిన రజనీకాంత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.













