Naga Vamsi: నాగవంశీ కజిన్ మూవీ డీటెయిల్స్ ఇవే!
టాలీవుడ్ సక్సెస్ఫుల్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) కుటుంబం నుంచి ఇప్పుడో హీరో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నాగ వంశీ బావమరిది రుష్య(Rushya) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ గా మొదలవనుందని ఇప్పటికే వార్తలొస్తున్న నేపథ్యంలో అసలు ఈ సినిమాకు సంబంధించిన వివరాలంటో చూద్దాం.
నాగవంశీ బావమరిది పేరు రుష్య. రుష్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాతోనే ఓ యువకుడు డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. అతని పేరు శంకర్(Shankar). ఇప్పటికే శంకర్ పలు సినిమాలకు వర్క్ చేశాడు. జాతి రత్నాలు(Jathi ratnalu), మ్యాడ్(Mad) సినిమాలకు శంకర్ పని చేశాడు. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
కలర్ ఫోటో(Colourphoto), బెదురులంక(Bedhurulanka) సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత బెన్నీ ముప్పనేని ఈ సినిమాను మంచి బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మిర్నా మీనన్(Mirna Menon) ను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ మూవీకి డాన్ బాస్కో(Don Bosco) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నాగవంశీ ఈ సినిమాను నిర్మించకపోయినా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ప్రతీ విషయంలో ఆయన సపోర్ట్ ఉండనుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.













