Akkineni Akhil: బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పిన అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) తన చిరకాల ప్రేయసి జైనబ్ రవ్జీ (Zainab Ravdjee) ని హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరిగింది. నాగార్జున తన కుమారుడి వివాహాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.అక్కినేని వారసుడు అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశారు. తన ప్రేయసితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున గం. 3.30 నిమిషాలకు జైనబ్ రవ్జీతో అఖిల్ వివాహం జరిగింది. బ్రహ్మ ముహూర్తాన వీరిద్దరూ మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.
హైదరాబాద్‌లోని అక్కినేని నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తన చిన్న కుమారుడి పెళ్లి గురించి నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ”అమల నేను ఎంతో ఆనందంతో, మా కుమారుడు తన ప్రియమైన జైనాబ్‌ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) ఒక అందమైన వేడుకలో వివాహం చేసుకున్నాడని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాము. మాకు అత్యంత ప్రియమైన వారి సమక్షంలో, ప్రేమ నవ్వుల మధ్య ఒక కల నిజమవడాన్ని మేము చూశాము. అఖిల్ – జైనాబ్ కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము” అని నాగార్జున ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా అఖిల్ పెళ్లి ఫోటోలను షేర్ చేసారు.అఖిల్ – జైనబ్ రవ్జీల వివాహం హిందూ సాంప్రదాయాల ప్రకారం జరిగింది. పెళ్లి వేడుకలో వధూవరులు ఇద్దరూ ట్రెడిషనల్ దుస్తుల్లో సందడి చేసారు. అఖిల్ తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి కుర్తా, ధోతి ధరించగా.. జైనబ్ ఐవరీ శారీలో కనిపించి ఆకట్టుకున్నారు. నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసిన అఖిల్ పెళ్లి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.