నా సామిరంగ ఏదొకటి తేల్చాలి
నా సామిరంగ మూవీ జనవరి 14న రిలీజ్ కానుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను పండగకి రిలీజ్ చేయాలని అటు నాగార్జున, ఇటు డైరెక్టర్ విజయ్ బిన్నీ ఎంతో పట్టుదలతో ఉన్నారు.
టీజర్ రిలీజయ్యాక నా సామిరంగపై అందరికీ మంచి అంచనాలేర్పడ్డాయి. సాంగ్స్ కూడా మెల్లిగా అందరికీ రీచ్ అవుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సినిమా ను ఎలాగైనా పోస్ట్ పోన్ చేయించడానికి చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో కంటెంట్ బాగున్నప్పడు సంక్రాంతికి రిలీజ్ చేసి, ఎందుకు తక్కువ థియేటర్లతో కాంప్రమైజ్ కావడం అని నాగ్ తో పలువురు ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారట.
సినిమా హిట్ అయినా కలెక్షన్స్ షేర్ అవుతాయి కాబట్టి అనుకున్న కలెక్షన్స్ రావని కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నారట. కానీ నాగ్ మాత్రం తన సంక్రాంతి నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని, ప్రొడ్యూసర్ మాత్రం కొంచెం ఆగి తర్వాత వద్దామా అన్న రీతిలో ఆలోచిస్తున్నాడని సమాచారం. మేకర్స్ ఈ విషయంలో త్వరగా ఏదొక నిర్ణయం తీసుకుని న్యూ ఇయర్ సందర్భంగా పోస్టర్స్ లో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారేమో చూడాలి.













