Nagarjuna: హిట్3 కోసం నాగ్ వెయిటింగ్
నా సామిరంగ(Naa Samiranga) సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్న నాగార్జున(Nagarjuna) ఆ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేసింది లేదు. ప్రస్తుతం ధనుష్(Dhanush) తో కుబేర(Kubera), రజినీకాంత్(Rajinikanth) తో కూలీ సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్న నాగార్జున, సోలో గా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలనే ఆలోచనతో మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే నాగ్ తన తర్వాతి సినిమా కోసం కథలను వింటూ, మరోవైపు కుబేర, కూలీ సినిమాల షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా నాగార్జునకు హిట్వర్స్ లో భాగంగా ఇప్పటికే మూడు సినిమాలను రూపొందించిన శైలేష్ కొలను(Sailesh Kolanu) ఓ కథ చెప్పాడట. శైలేష్ చెప్పిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ నాగ్ కు కూడా నచ్చి ఫుల్ నెరేషన్ ఇవ్వమని అడిగాడట.
ఈ లోపు శైలేష్ చేసిన హిట్3(Hit3) మూవీ రిజల్ట్ కూడా బయటికొచ్చేస్తుంది కాబట్టి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామని నాగ్(Nag) డిసైడ్ అయ్యాడట. హిట్3 సక్సెస్ అయితే శైలేష్ తో మరో డౌట్ లేకుండా వెంటనే సినిమాను చేసేయాలనే ఆలోచనలో నాగ్ ఉన్నాడని తెలుస్తోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. హిట్3 రిజల్ట్ ను బట్టి నాగ్- శైలేష్ మూవీ ఎప్పుడా అనేది తేలుతుంది.






