హిట్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్న కింగ్ నాగార్జున…
హీరో కింగ్ నాగార్జున ప్రెజెంట్ కెరీర్ లో అర్జెంట్ గా ఒక సూపర్ హిట్ సినిమా పడితే కానీ మునుపటి జోష్ ని అందుకోలేరు అనిపిస్తుంది. సీనియర్ హీరో అయినా కూడా బాక్సాఫీస్ వద్ద తన మార్క్ చూపిస్తూ వస్తున్న నాగ్ ఈమధ్య కాస్త స్లో అయ్యాడనే చెప్పాలి. బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టినా, ఆ తర్వాత వచ్చిన “ది ఘోస్ట్” ఫ్లాప్ టాక్ అందుకుంది. ప్రేక్షకులు తనని ఎలాంటి సినిమా చేయాలని భావిస్తున్నారో అర్ధం కాక నాగ్ కథల వేటలో పడినట్టు తెలుస్తుంది.
హిట్టు సినిమా కథ కోసం నాగార్జున రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారట. మూవీ రైటర్స్ అందరిని తనకు సెట్టయ్యే కథలను తీసుకురమ్మని చెప్పినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. నాగార్జున నెక్స్ట్ సినిమా ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం అందుతుంది. నాగార్జున మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తుంది. ఇక నాగార్జున కూడా ప్రేక్షకులు తనని ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తీస్తేనే చూస్తున్నారని ఫిక్స్ అయ్యారు. ప్రసన్న కుమార్ సినిమా తర్వాత కూడా మరో రైటర్ కథతో నాగార్జున సినిమా ఉంటుందని వారలు వినిపిస్తున్నాయి.
ఇంతకుముందు అన్నపూర్ణ బ్యానర్ లో కొత్త కథలతో సొంతగా ఎక్సపెరిమెంట్స్ చేసే వారు. ఇప్పుడు ఆ బ్యానర్ లో కూడా సినిమాలు తగ్గిపోయాయి. ఎంటర్టైన్మెంట్ సినిమాలతోనే ఆడియన్స్ ని మెప్పించాలని ఫిక్స్ అయిన కింగ్, ఆ జోనర్ కథలతోనే తన వద్దకి రమ్మంటూ దర్శకులకు చెబుతున్నారట. ఇక రీసెంట్ గా ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో రైటర్స్ నుండి కథలు విన్నట్టు సమాచారం. వాటిలో రెండు కథలు నాగార్జునకు బాగా నచ్చాయట. త్వరలో ఆ సినిమాల ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. తనకి నచ్చిన కథలతో తీసిన సినిమాలైనా హిట్టు కొట్టి నాగ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.













