బాబా సన్నిధిలో అక్కినేని నాగార్జున
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రం హలో. ఈ రోజు ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. బాబా ఆశీస్సులు పొందుతున్న ఫొటోను నాగ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముందు బాబా ఆశీర్వాదం తీసుకోవడానికి నా స్నేహితుడు మహేశ్‌తో కలిసి షిర్డీకి వచ్చాను. థ్యాంక్యూ బాబా అని నాగ్ పోస్ట్ పేర్కొన్నారు. విక్రమ్ కె.కుమార్ హలో చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణస్టూడియోన్ బ్యానర్‌పై నాగార్జున నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ పనులుపూర్తయ్యాయి. హైదరబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న ప్రీరిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అఖిల్‌కి జోడిగా కల్యాణి ప్రియదర్శన్ నటించారు. అనూప రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. రమ్యకృష్ణ, జగపతిబాబు అఖిల్‌కి తల్లిదండ్రులుగా నటించారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.













