Bigg Boss9: సరికొత్తగా రానున్న బిగ్ బాస్ సీజన్9

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) సరికొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఉన్నట్టుండి బిగ్ బాస్ 9(Bigg Boss Season9)వ సీజన్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా, ఆ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ కు హోస్ట్ మారనున్నారని తెగ ప్రచారం జరగ్గా, ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ మరోసారి కూడా నాగార్జునే(Nagarjuna) బిగ్‌బాస్ సీజన్9 కు హోస్ట్ గా వ్యవహరించనున్నారని క్లారిటీ ఇచ్చారు షో నిర్వాహకులు.
ప్రోమోలో నాగార్జున మరింత స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తూ ఈసారి సీజన్ గత సీజన్లకంటే భిన్నంగా ఉంటుందని చెప్పారు. కొత్త లోగో తో పాటూ, సరికొత్త కాన్సెప్ట్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఆటలో అలుపు వచ్చినంత సులభంగా గెలుపు రాదని, అది రావాలంటే కేవలం యుద్ధం సరిపోదని, కొన్నిసార్లు ప్రభంజనం కూడా సృష్టించాలని చెప్పారు నాగ్.
నాగ్(Nag) మాటల్ని బట్టి చూస్తుంటే ఈసారి సీజన్ చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉండనుందని అర్థమవుతుంది. ఇకపై బిగ్ బాస్ గేమ్ చదరంగం కాదని, రణరంగమని చెప్తూ బిగ్ బాస్ లో రూల్స్, టాస్క్ లు మారనున్నాయని కాన్సెప్ట్ గురించి చిన్న క్లూ ఇచ్చారు నాగ్. ఎప్పటిలానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పలువురు నటీనటులతో ఈ సీజన్ కూడా మొదలవనుంది. సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ సీజన్9 మొదలయ్యే అవకాశాలున్నాయి.