Nagarjuna: ఆయన పెర్ఫార్మెన్స్ తెలుగు ఆడియన్స్ కు పండగే!
ఖైదీ(Khaidhi), విక్రమ్(Vikram), లియో(Leo) సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) నుంచి రాబోతున్న సినిమా కూలీ(Coolie). సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను ఎంతగానో ఎగ్జైట్ చేయడంతో కూలీ ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
కూలీ సినిమాలో ఉపేంద్ర(Upendra), నాగార్జున(Nagarjuna), ఆమిర్ ఖాన్(Aamir Khan), సౌబిన్ షాహిర్(Soubin Shahir), శృతి హాసన్(Shruthi Haasan) కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వివిధ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూలీలో భాగమవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్ట్ 14న కూలీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా శృతి కూలీ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కూలీ సినిమాలో నాగార్జున ఓ నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని, సినిమాలో ఆయన నటన చూసి తాను షాకయ్యానని, తెలుగు ఆడియన్స్ కు ఆయన పెర్ఫార్మెన్స్ ఓ గొప్ప ట్రీట్ గా ఉండబోతుందని శృతి వెల్లడించింది. శృతి కామెంట్స్ అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెడుతుండగా కూలీలో నాగ్ ఏ రేంజ్ లో విలనిజం పండించారో అని అందరికీ ఆసక్తి పెరిగింది.













