ప్రతిసారీ ప్రచారం జరుగుతోంది.. అది నిజం కాదు : నాగార్జున
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే విషయం పై ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ది ఘోస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్‌గా మాత్రం నటిస్తానన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ తాను పోటీ చేస్తానని ప్రచారం జరుగుతోందని, అది నిజం కాదని అన్నారు.













