Nagarjuna: రికార్డులు శాశ్వతం కాదు

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరిని మాట్లాడించినా బాక్సాఫీస్ రికార్డుల గురించే మాట్లాడుతున్నారు. మా హీరో పేరిటే ఎక్కువ రికార్డులున్నాయని తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతుంటాయి. ఫ్యాన్సే కాదు, దర్శకనిర్మాతలు కూడా ఈ బాక్సాఫీస్ నెంబర్ల వెంటే పరిగెడుతున్నారు. హీరోల స్టార్‌డమ్ ను కూడా ఆ నెంబర్ల ఆధారంగానే డిసైడ్ చేస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రూ.1000 కోట్ల చేరడానికి మీపై ప్రెజర్ లేదా అనే ప్రశ్న నాగార్జున(Nagarjuna)ను అడగ్గా దానిపై స్పందిస్తూ బాక్సాఫీస్ నెంబర్లు, రికార్డుల గురించి మాట్లాడాడు. తానెప్పుడూ రికార్డుల గురించి పట్టించుకోనని, అవి శాశ్వతం కాదని, గతంలో తాను తన సినిమాలతో చాలా సినిమాలు చేయగా, అందులో చాలా సినిమాలు రికార్డులు సృష్టించాయని, కానీ ఆ తర్వాత ఆ రికార్డులన్నీ బ్రేకయ్యాయని చెప్పాడు.
బాక్సాఫీస్ నెంబర్ల గురించి పట్టించుకోవడం మానేశానని, ఇవాళ రూ.1000 కోట్ల క్లబ్ ఉంటే మరో రెండేళ్లకు అది రూ. 2000 కోట్ల క్లబ్ అవుతుందని అన్నాడు. గత కొన్నేళ్లుగా తాను డిఫరెంట్ పాత్రలతో ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలని చూస్తున్నానని, అలా చేసిందే బ్రహ్మాస్త్ర(brahmastra) అని, ఈ సంవత్సరం మరో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నానని, ఆ రెండు పాత్రలూ ఆడియన్స్ కు తప్పకుండా నచ్చుతాయని ధీమా వ్యక్తం చేశాడు నాగార్జున. కాగా నాగ్(nag) ప్రధాన పాత్రలో నటించిన కుబేర(kubera) జూన్ 20న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.