నాగ్ బర్త్డే కు ఫ్యాన్స్ కు స్పెషల్ గలాటా
ఎప్పుడెప్పుడు నాగ్ కొత్త సినిమా మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురైంది ఇన్నాళ్లు. మొత్తానికి దేవుడు కరుణించి నాగ్ కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసి లాంఛ్ చేయనున్నాడు నాగార్జున. ఈ సినిమాకు గలాటా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ప్లాన్ చేసుకున్న ఆ ప్రాజెక్ట్ కు ఇప్పుడు డైరెక్టర్ మారాడని తెలుస్తోంది. ఆ బాధ్యతలను కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీకి నాగ్ అప్పచెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మలయాళ హిట్ మూవీ పోరంజు మరియం జోస్ కు రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ అది కాకుండా ఏదైనా ఫ్రెష్ సబ్జెక్ట్ దొరికితే మూవీ అనౌన్స్ చేసిన తర్వాత ఆ సంగతి తెలియనుంది. ఒకప్పుడు కొరియోగ్రాఫర్ లారెన్స్ ని డైరెక్టర్ గా పరిచయం చేసిన నాగ్ ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ ని డైరెక్టర్ గా పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే హీరోయిన్ గా కాజల్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్ నిరీక్షణకు ఇన్నాళ్లకు చెక్ పడింది.













