రాజకీయాల్లోకి నాగార్జున ?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో నాగార్జున అక్కినేనికి గల అనుబంధం అందరికీ తెలిసిందే. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్‌తోనూ నాగ్‌కి అంతే అనుబంధం ఉంది. అంతేకాదు, రాజకీయాల పట్ల నాగార్జున ప్రత్యేకమైన ఆసక్తి ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ నేపధ్యంలో రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున నాగార్జున పోటీ చేసే అవకాశముందనే ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. నాగార్జున కూడా ఇందుకోసమే సినిమాలు చేయకుండా ఉన్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం తన కుమారుల కెరీర్స్ చక్కదిద్దే పనిలో తలమునకలై ఉన్న కింగ్ నాగార్జున మరి నిజంగానే రాజకీయ రంగ ప్రవేశం చేసి, కింగ్ మేకర్ అవుతారా అన్నది వేచి చూడాలి.













