నాగ్, ధనుష్ సినిమా ఒప్పుకోవడానికి రీజన్స్ ఇవే!
సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరున్న శేఖర్ కమ్ముల తన కెరీర్లోనే మొదటిసారి ఓ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ తీస్తాడన్న వార్త తెలియగానే అందరూ చాలా ఆశ్చర్యపోయారు. కానీ షూటింగ్ స్టార్ట్ అవడం మాత్రం బాగా లేట్ అయింది. ఈ లేట్ కు కారణం ఈ మూవీ కోసం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదాకా వెయిట్ చేయడమే అని తెలుస్తోంది. స్టోరీ లైన్ బాగా నచ్చినప్పటికీ, ఫుల్ నెరేషన్ ఇచ్చేవరకు నాగ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అంతేకాదు మరో రీజన్ కూడా ఉందట. నాగ్ ఈ సినిమా ఒప్పుకోవడానికి శేఖర్ కమ్ముల మీద సాఫ్ట్ కార్నర్ ఒక కారణం కాగా, నిర్మాత సునీల్ నారంగ్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మరో కారణం. దీంతో నాగ్ నో చెప్పడానికి ఛాన్స్ లేకపోయింది.
దానికితోడు ఈ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మరోసారి ఆ ప్రేక్షకులను అలరించొచ్చనే ఆలోచన కూడా నాగ్ కు వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా మొత్తానికి ఓ క్రేజీ కాంబోలో నాగ్ భాగమయ్యాడు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. లవ్ స్టోరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.













