Nagarjuna: బిగ్ బాస్9 కోసం నాగ్ ఎంత తీసుకుంటున్నాడంటే
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్(biggboss) కొత్త సీజన్ రెడీ అవుతోంది. ఆల్రెడీ 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదో సీజన్ కు రెడీ అవడంతో అందరూ దీని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి సీజన్ గతంలో కంటే భిన్నంగా ఉంటుందని, కొత్త టాస్కులుంటాయని ఇప్పటికే క్లారిటీ ఇస్తూ స్టార్ మా(Star maa) తెలిపింది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి బిగ్ బాస్ షో ప్రసారం కానుందని సమాచారం. గత 6 సీజన్లుగా బిగ్బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జునే(nagarjuna) తొమ్మిదో సీజన్ ను కూడా హోస్ట్ చేయనున్నారు. అయితే తొమ్మిదో సీజన్ కోసం నాగ్ చాలా భారీగా ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ వింటుంటే నాగ్(Nag) కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
బిగ్బాస్ 9(Biggboss9)వ సీజన్ కు నాగార్జున అక్షరాలా రూ.35 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని, గత సీజన్ కు కేవలం రూ.20 కోట్లు మాత్రమే తీసుకున్నారని, కానీ ఇప్పుడు తన రేటును బాగా పెంచారని, నాగార్జునకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు కూడా నాగ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారని అంటున్నారు. నాగ్ ఈ షో కోసం ఎంతలేదన్నా మూడు నెలల పాటూ తన వీకెండ్స్ ను కేటాయించాల్సి ఉంటుంది.







