Nagarjuna: హోస్టింగ్ తో ఫిదా చేసిన నాగ్

నా సామిరంగ(Naa Samiranga) సినిమా తర్వాత అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా మరో సినిమా వచ్చింది లేదు. కానీ కుబేర(Kuberaa), కూలీ(Coolie) సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించడంతో పాటూ మంచి పేరు తెచ్చుకున్న నాగ్ ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. తన సక్సెస్ జోష్ నాగ్(Nag) వేసే ప్రతీ అడుగులోనూ మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
తన స్టైలింగ్ నుంచి ప్రతీ దాంట్లో నాగ్ ఇప్పుడు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. అంతేకాదు, బుల్లితెర రియాలిటీ షో కు గత కొన్ని సీజన్లుగా నాగార్జున హోస్ట్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేనంత యాక్టివ్ గా నాగార్జున ఈ సారి తొమ్మిదో సీజన్ లో కనిపిస్తున్నారు. ఆయన ఎనర్జీ షో ను మరింత రసవత్తరంగా కొనసాగిస్తుంది.
ఈ సారి బిగ్‌బాస్(Biggboss) గత శని, ఆది వారం ఎపిసోడ్స్ లో నాగార్జున తన హోస్టింగ్ తో ఇరగదీశారనే చెప్పాలి. ఎప్పుడూ లేనంత జోష్ గా, ఎనర్జిటిక్ గా కనిపించడంతో పాటూ కంటెస్టెంట్ల పై చాలా సీరియస్ అవుతూ వారిని సరైన దారిలో నడుచుకోవాలని హెచ్చరించారు. బిగ్ బాస్ హోస్టింగ్ విషయంలో గతంలో కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్న నాగ్ ఈసారి సీజన్ లో వాటిని అధిగమించి మరీ ప్రశంసలు దక్కించుకోవడం మామూలు విషయం కాదు. గత వీకెండ్ నాగ్ హోస్టింగ్ ను సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ వాటికి సంబంధించిన వీడియో క్లిప్స్ ను నెట్టింట వైరల్ చేస్తున్నారు.