సూపర్ స్టార్ మూవీలో కింగ్?
రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా రానున్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. రజినీని మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపిస్తానని లోకేష్ ఆల్రెడీ ఫ్యాన్స్ కు మాటివ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే లోకేష్ ఈ సినిమాకు క్యాస్టింగ్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో కూలిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఓ కీలక పాత్ర కోసం నాగార్జునని సంప్రదించాడట లోకేష్. వాస్తవానికి లోకేష్, నాగ్ కొన్నాళ్ల కిందట కలిసిన మాట నిజమే. కానీ అది కూలీలో క్యారెక్టర్ అడగడానికని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు సడెన్ గా ఈ విషయం బయటికొచ్చేసరికి నాగ్ ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు.
నాగ్, రజినీ ఇప్పటివరకు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది లేదు. ఈ డ్రీమ్ కాంబోని లోకేష్ నిజం చేయగలిగితే ఫ్యాన్స్ కు అంతకుమించి కావాల్సిందేముంటుంది. ఈ క్యారెక్టర్ విషయంలో నాగార్జున కూడా సానుకూలంగానే ఉన్నారని అక్కినేని వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేం. ఇకపోతే కూలీలో లోకేష్ ఇలాంటి సర్ప్రైజ్లు చాలానే ప్లాన్ చేసినట్లు టాక్.













