ధనుష్ మూవీలో నాగ్ స్పెషల్ రోల్
తమిళ స్టార్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా అనౌన్స్ అయినప్పటికీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. కొన్ని నెలలుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేసిన శేఖర్ కమ్ముల ఈ సినిమాలో ఓ ప్రత్యేక గెస్ట్ రోల్ ని రెడీ చేశారట. ఓ ఇంపార్టెంట్ సిట్యుయేషన్ లో సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ ఇస్తుందట.
ఈ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ నాగ్‌ను అనుకుంటున్నారట శేఖర్ కమ్ముల. గతంలో కార్తీతో ఊపిరి సినిమాలో నటించిన నాగ్, ఇప్పుడు ధనుష్ తో కలిసి పని చేయనున్నాడు. ఇప్పటికే నాగ్‌కు ఈ కథ చెప్పగా, నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ షో తో బిజీగా ఉన్న నాగ్, తను సోలో హీరోగా ఎప్పుడు సినిమా చేస్తారనేది సస్పెన్స్ లోనే ఉంది.
సార్ మూవీతో తెలుగులో మంచి హిట్ అందుకున్న ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు స్ట్రయిట్ మూవీతో రాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత సునీల్ నారంగ్ ఆలోచిస్తున్నారట. హీరోయిన్ గా రష్మిక కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నాడని టాక్ నడుస్తుంది.













