Beggar: బెగ్గర్ లో టాలీవుడ్ హీరో క్యామియో

ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న పూరీ జగన్నాథ్(Puri Jagannadh) హిట్ అందుకుని ఇప్పుడు ఐదేళ్లు అవుతుంది. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) తర్వాత పూరీ మరో హిట్ అందుకుంది లేదు. ఆ సినిమా తర్వాత లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాలను భారీగా తెరకెక్కించాడు. కానీ ఆ రెండు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి.
దీంతో పూరీకి నెక్ట్స్ ఎవరు ఛాన్స్ ఇస్తారా అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పూరీ జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి కథ చెప్పి ఆయన్ను మెప్పించి, ఒప్పించి సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. బెగ్గర్(Beggar) సినిమాలో సీనియర్ బ్యూటీ టబు(Tabu) ఓ కీలక పాత్ర చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ కూడా చేశారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వినిపిస్తోంది. బెగ్గర్ మూవీలో ఓ స్టార్ క్యామియో చేయనున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు. అక్కినేని హీరో నాగార్జున(Akkineni Nagarjuna). బెగ్గర్ లో ఓ కీలక పాత్ర కోసం నాగ్(Nag) ను తీసుకోవాలని పూరీ అనుకుంటున్నాడట. గతంలో వీరిద్దరూ కలిసి సూపర్(Super), శివమణి(Sivamani) సినిమాలు చేశారు. మరి బెగ్గర్ లో నాగార్జున క్యామియో విషయంలో వస్తున్న వార్తల్లో నిజమెంతన్నది చూడాలి.