BiggBoss9: మరోసారి హోస్ట్ గా నాగార్జున

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్(Bigg Boss) కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎన్టీఆర్(NTR) హోస్ట్ గా మొదలైన ఈ షోను ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని(Nani) హోస్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు అక్కినేని నాగార్జునే(Akkineni Nagarjuna) ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ను ఎంతో సక్సెస్‌ఫుల్ గా ముందుకు తీసుకెళ్తూ ఈ షో ద్వారా మరింత క్రేజ్ ను అందుకున్నాడు.
ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు తొమ్మిదో సీజన్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సారి బిగ్ బాస్ ను నాగార్జున హోస్ట్ చేయడం లేదని, ఆయన ప్లేస్ లో మరొకరు వస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పేరు కూడా గట్టిగానే వినిపించింది. నాగ్(Nag) వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన స్థానంలోకి బాలయ్య(Balayya) వస్తున్నాడని అన్నారు.
కానీ తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 9వ సీజన్ కు కూడా అక్కినేని నాగార్జునే యాంకర్ గా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. సీజన్9 కోసం నాగార్జున అడిగినంత రెమ్యూనరేషన్ ను ఇవ్వడానికి షో నిర్వాహకులు కూడా ఓకే చెప్పారని వార్తలొస్తున్నాయి. దీంతో మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయ్యాడని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే గత కొన్ని సీజన్లుగా ఎప్పటికప్పుడు కొత్త సీజన్ రాబోయే ముందు హోస్ట్ మారతున్నాడని వార్తలు రావడం కామనైపోయింది.