మన్మథుడు 2 షూటింగ్ పూర్తి
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు 2. గతంలో ఆయన నటించిన మన్మథుడు చిత్రానికి కొనసాగింపుగా తీస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, జెమిని కిరణ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. హీరోయిన్గా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. రొమాంటిక్, ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 9న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే టీజర్ విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ కనిపించనుంది. ఈ చిత్రంలో ఇంకా లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులు నటిస్తున్నారు.













