22 టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున
టీజర్ చూశా. క్రైమ్ థ్రిల్లర్‌లా ఆసక్తికరంగా ఉంది. మహిళ దర్శకురాలు దివంగత బి.జయ వాళ్లబ్బాయి శివ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. దర్శకుడిగా తల్లి పేరును శివ నిలబెట్టాలి. అలాగే, తండ్రి బీఏ రాజు పేరు కూడా. సినిమా పెద్ద హిట్టవ్వాలి అని నాగార్జున అన్నారు. రూపేశ్ కుమార్ చౌదరీ, సలోనీ మిశ్రా జంటగా శివ దర్శకత్వంలో సుశీలాదేవీ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 22. నాగార్జున ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. నూతన దర్శకులు తొలుత ప్రేమకథ తీయాలనుకుంటారు. శివ విభిన్నంగా ఆలోచించి క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. టీజర్ చూస్తుంటే అతని పరిణితి ఏంటో తెలుస్తోంది. ఇటువంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం అని మారుతి అన్నారు. కథ ప్రకారమే 22 టైటిల్ పెట్టామని శివ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, నిర్మాతలు కొండా కృష్ణంరాజు, బీఏ రాజు తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.













