నయన్ ప్రేమపై నాగార్జున రియాక్షన్
ఏ సెలబ్రిటీ అయినా సరే తమ గత ప్రేమ కథల గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించరు. పెళ్లైన తర్వాత తమ పాత లవ్ స్టోరీలను గుర్తు చేసుకోవాలని కానీ, ఆ జ్ఞాపకాలను తవ్వుకోవాలని కానీ ఎవరూ అనుకోరు. హీరోయిన్లయితే అసలు ఆ పని చేయరు. కానీ లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) మాత్రం వీటన్నింటికీ భిన్నంగా ఉంది.
నయన్ ప్రేమ, పెళ్లి, ఫిల్మ్ కెరీర్‌పై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్(Nayanthara: Beyond the fairy tale) అనే డాక్యుమెంటరీలో తన ఒకప్పటి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది. పేర్లు చెప్పకపోయినా శింబు(Simbhu), ప్రభుదేవా(Prabhudeva)లతో నయన్ గతంలో రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆ టైమ్ లో తను ఎన్నో ఇబ్బందులు పడ్డట్టు నయన్ ఈ డాక్యుమెంటరీ లో చెప్పింది.
తన మాజీ లవర్ పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని కండిషన్ పెట్టాడని చెప్పుకొచ్చింది నయన్. అది ప్రభుదేవానే అన్న విషయం అందరికీ తెలిసిందే. నయన్ మాత్రమే కాదు శింబుతో రిలేషన్లో ఉన్నప్పుడు నయన్ ఎంత ఇబ్బంది పడిందో ఇన్‌డైరెక్ట్‌గా అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఈ డాక్యుమెంటరీలో మాట్లాడాడు.
నయన్(Nayan), నాగ్(Nag) కలిసి బాస్(Boss), గ్రీకువీరుడు(Greeku Veerudu) సినిమాలు చేశారు. తనతో సినిమా చేస్తున్న టైమ్‌లో నయన్ వేరే రిలేషన్షిప్లో ఉండేదని దాని వల్ల ఆమె ఎంతో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించేదని, నయన్ ఫోన్ రింగ్ అవుతుంటే ఓ రకమైన అలజడి కనిపించేదని, నయన్ మూడ్ పూర్తిగా మారిపోయేదని, కొన్నిసార్లు ఫోన్ కూడా ఆఫ్ చేసేదని నాగ్ గుర్తు చేసుకున్నాడు. నీ లాంటి అమ్మాయి ఇలాంటి రిలేషన్షిప్ లో ఎందుకున్నావని తాను నయన్ ను అడిగినట్లు కూడా ఆయన వెల్లడించాడు.













