నాగ్ 99వ సినిమాకు ఎన్నో కష్టాలు
ది ఘోస్ట్ సినిమా రిలీజై ఇన్ని నెలలవుతున్నా, టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటి వరకు తన తర్వాతి సినిమాను మొదలుపెట్టకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ నాగ్ ఆయనతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ సినిమా పోరింజు మరియంజోస్ ఆధారంగా రూపొందనున్న ఈ విలేజ్ డ్రామా స్టోరీ ఎప్పుడో రెడీ అయింది.
కానీ రైట్స్ విషయంలో నిర్మాతల మధ్య వచ్చిన అభిప్రాయబేధాల వల్ల ఈ సినిమా స్టార్ట్ అవడానికి లేటవుతుంది. ఈ సినిమా కోసమే స్పెషల్ గా గడ్డం పెంచిన నాగ్ కు ఆ లుక్ శాటిస్ఫైయింగ్గా లేకపోవడంతో మళ్లీ క్లీన్ షేవ్ కు వచ్చేశాడని ఇన్ సైడ్ టాక్. దీంతో మరో లుక్ పై ప్రసన్న ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయిన లేట్ ఎలాగూ అయింది కాబట్టి అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాకే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అసలు ఈ సినిమా క్యాన్సిల్ అయిందని, నాగ్ మరో ఆప్షన్ చూసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదైనా సరే టీమ్ మెంబర్స్ మాత్రం ఈ సినిమా గురించి బయట మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. అవసరమైతే ఈ స్టోరీకి డైరెక్టర్ ను మార్చేందుకు కూడా నాగ్ రెడీ గా ఉన్నారని కూడా టాక్.
ఒకవేళే అదే కనుక జరిగితే ప్రసన్న కుమార్కు కెరీర్ తొలినాళ్లలోనే ఇది కోలుకోలేని దెబ్బగా మారడం ఖాయం. మొత్తానికి నాగార్జున తన 99వ సినిమా మొదలుపెట్టడానికి చాలా గట్టి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే నాగ్ తన వందో సినిమాను మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.













