సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని టార్గెట్ చేసిన నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్యకాలంలో కొంతమంది చేసిన కామెంట్స్‌కి ఘాటుగా సమాధానమివ్వడం, ఏదైనా సోషల్ ఇష్యూ వస్తే దాని గురించి స్పందించడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని టార్గెట్ చేశాడు. తాజాగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తీసుకొని తనకు తెలిసిన విశ్లేషణ ఇచ్చాడు. గతంలో హిందూ దేవుళ్ళపై విమర్శలు చేసిన వారిపై ఎటాక్ చేసిన నాగబాబు ఇప్పుడు దేవుడే లేడంటూ కొత్తగా కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్‌కి నాగబాబు సమాధానమిచ్చారు. అసలు రజనీకాంత్ ఏమన్నారంటే.. `మన కంటికి కనిపించేది ఏదైనా.. ఎవరు ఒకరు క్రియేట్ చేసిందే అయివుంటుంది. లేకపోతే ఆ వస్తువు అనే దానికి ఉనికి లేదు. అలాగే ఇంత విశాల విశ్వం కూడా ఉనికిలో ఉందంటే దాన్ని కూడా ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉండాలి. ఆయనే భగవంతుడు` అని చెప్పారు.
దానికి నాగబాబు స్పందిస్తూ `మరి అంత క్రియేట్ చేసిన దేవుడిని క్రియేట్ చేసింది ఎవరు. ఒక శక్తి ఉనికిలో ఉందంటే దానికి ఒక క్రియేటింగ్ రీజన్ వేరే ఉండాలి. ఆ కారాణమే దేవుడిని క్రియేట్ చేసి ఉండాలి. అలాగే ఆ దేవుడిని క్రియేట్ చేసిన రీజన్‌కు ఇంకో రీజన్ ఉండి తీరాలి. సో వెతుక్కుంటూ వెళితే.. దానికి అంతే ఉండదు. సో దేవుడు అనే కాన్సెప్ట్ కి అసలు మీనింగే లేదు. సో.. మనందరం దేవుడు లేకుండా జీవించడం ఎలాగో నేర్చుకుంటే సరిపోతుంది` అని రజనీకాంత్ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. ఒక విషయం గురించి ఎవరైనా వ్యాఖ్యలు చేసినపుడు దాన్ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారూ ఉంటారు. అలాగే వీరిద్దరి అభిప్రాయాలతో కొందరు ఏకీభవిస్తుంటే,, మరికొందరు.. ఎందుకీ అనవసరమైన మాటలు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు కేవలం తన ఉనికిని చాటుకోవడానికే నాగబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటున్నారు.













