నాగబాబు అనవసరంగా ఇరుక్కుంటున్నాడా…!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు తనకు తానే అనవసరంగా కేసులో ఇరుక్కున్నాడు. మహాత్మాగాంధీ హత్యోదంతం అసలే వివాదాస్పదం. గతంలో ఎందరో కొమ్ము తిరిగిన మేధావు దీంట్లో మే పెట్టి రచ్చ రచ్చ చేశారు. ఇప్పుడు నాగబాబు దీన్ని తకెత్తుకొని తానో మేధావి మాదిరిగా ధైర్యంగా ట్విట్టర్ లో ఎవరూ పట్టించుకోని గాంధీజీ హంతకుడు నాథూరాం గాడ్సేను ఆయన పుట్టినరోజున నాగబాబు గుర్తుకు తెచ్చుకొని పోస్ట్ చేసాడు. మళ్ళి ఈ రోజు “ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉంది.ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ. ” అని ట్వీట్ చేసాడు. గాడ్సే విషయం లో ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది. కాంగ్రెసోళ్లు విమర్శ బాణాు వేస్తున్నారు.













