బాలకృష్ణపై వివాదంలో క్లారిటీ ఇచ్చిన విశ్వక్ సేన్
రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన రెండు విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి చీఫ్ గెస్టుగా వచ్చిన బాలకృష్ణ కూర్చున్న కుర్చీ కింద వాటర్ బాటిల్ తో పాటూ మందు సీసా కూడా ఉన్నట్లు వచ్చిన వీడియో కాగా రెండోది ఈవెంట్ చివర్లో స్టేజ్ మీదున్నప్పుడు హీరోయిన్ అంజలిని బాలయ్య చిన్నగా తోసిన వీడియో. ఈ రెండు విషయాల గురించే ప్రస్తుతం రచ్చంతా. వీటి వెనుక, ముందు ఏం జరిగిందనేది ఆలోచించకుండా కేవలం కొద్ది సెకండ్ల వీడియోని మాత్రమే సర్కిలేట్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. తెలుగుతో పాటూ ఇతర భాషల సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా నిజమేంటన్నది చెక్ చేయకుండా వాటిని పోస్ట్ చేయడం ఆశ్చర్యకరం.
ఇదిలా ఉంటే ఈ రెండు వివాదాల గురించి ఆ సినిమా నిర్మాత నాగవంశీ, హీరో విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. వీడియోలో చూపించిన మంచు సీసా ఎవరో సీజీలో కావాలని క్రియేట్ చేశారని, ఈవెంట్ లో ప్రత్యక్షంగా ఉన్న తమకు మాత్రమే అక్కడ ఏముందో తెలుసని, తమ సినిమా సెకండ్ పార్ట్ సీజీకి ఈ వీడియో ఎడిటింగ్ చేసిన వాళ్లే పనిచేయబోతున్నారని విశ్వక్ చురకలంటించాడు. ఇక అంజలిని తోసేయడం జరగలేదని, ఆ పెద్ద సౌండ్ లో పక్కకు జరగమని చెప్తే ఆమెకు వినిపించకపోవడంతో చనువుతో పక్కకు జరిపారు తప్పించి అందులో మరో ఉద్దేశం లేదని, ఆ తర్వాత వెంటనే వారిద్దరూ హైఫై ఇచ్చుకోవడం ఎవరూ చూపించలేదన్నారు. ఈ విషయంలో ఇప్పుడు వీళ్లిచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలైనా ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరగడంతో పాటూ ఆ వీడియోలు నెట్టింట బాగా రచ్చ చేశాయి.













