సిద్దూతో భారీ డీల్ సెట్ చేసిన నాగవంశీ
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), నిర్మాత నాగవంశీ(Naga Vamsi) కాంబినేషన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరి కలయికలో వచ్చిన డీజే టిల్లు(DJ TIllu), టిల్లూ స్వ్కేర్(Tillu Square) సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ రెండు సినిమాలూ సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) కు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. త్వరలోనే ఆ సినిమాలకు సీక్వెల్ గా టిల్లూ క్యూబ్(tillu qube) కూడా రానుంది.
దానికి సంబంధించిన వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. టిల్లూ స్వ్కేర్ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్దూ జొన్నలగడ్డ. నీరజ కోన(Neeraja Kona) దర్శత్వంలో తెలుసు కదా(thelusu Kadha), బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో జాక్(Jack) సినిమాలు చేస్తున్న సిద్దూ రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కోహినూర్(kohinoor) అనే మరో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు.
రవికాంత్ పేరేపు(ravikanth perepu) దర్శకత్వంలో రూపొందనున్న కోహినూర్ సినిమా సరికొత్త కథాంశంతో సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తోంది. అంటే సితార బ్యానర్ లో సిద్దూ మొత్తం మూడు సినిమాలు చేయనున్నాడన్నమాట. కోహినూర్ రెండు పార్టులతో పాటూ టిల్లూ క్యూబ్ కూడా ఇదే బ్యానర్ లో రూపొందనుంది. దీంతో ఈ మూడు సినిమాలకు గానూ సిద్దూకి భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నాగవంశీ డీల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య భారీ డీల్ జరిగి ఉంటుందని నెటిజన్లు నెట్టింట ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు.













