మాట నిలబెట్టుకున్న హీరో, నిర్మాత
ఈ దీపావళికి మొత్తం బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. దుల్కర్ సల్మాన్(Dulquer Salman) లక్కీ భాస్కర్(Lucky Baskhar), కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(KA) డైరెక్ట్ తెలుగు సినిమాలు కాగా అమరన్(Amaran), బఘీర(Bagheera) డబ్బింగ్ సినిమాలుగా రిలీజయ్యాయి. అయితే తెలుగులో రిలీజైన రెండు సినిమాలకూ మంచి టాక్ తో పాటూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చాలా రోజులకు పండగ సీజన్ ను వాడుకున్నందుకు టాలీవుడ్ మూవీ లవర్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు.
అంతేకాదు ఈ రెండు సినిమాలు కచ్ఛితంగా హిట్ అవుతాయని చిత్ర యూనిట్ ముందు నుంచే ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. లక్కీ భాస్కర్ సినిమాను కొత్త బ్యాక్ డ్రాప్ తో తీశామని, సినిమాలో ఏమైనా తప్పులు దొరికితే పిలిచి మరీ పార్టీ ఇస్తానని చిత్ర నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) రిలీజ్ కు ముందు ఛాలెంజ్ చేశాడు. వంశీ చెప్పినట్లే మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉండటంతో పాటూ ఎలాంటి తప్పులు కనిపించలేదు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ నిర్మించిన క సినిమా కూడా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ ఎలాగైనా క సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలని గత సినిమాల కంటే ఎక్కువగా కష్టపడ్డాడు. కొత్త డైరెక్టర్ అయినా కథ మీద నమ్మకంతో మంచి బడ్జెట్ పెట్టి సినిమా చేశాడు. అంతేకాదు ఈ సినిమాలో తాము తీసుకున్న పాయింట్ వేరే ఏ సినిమాలో అయినా టచ్ చేసినట్లు అనిపించినా, క్లైమాక్స్ నచ్చకపోయినా తాను ఇక సినిమాలే చేయనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కిరణ్.
క మూవీ చూశాక కిరణ్ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం కరెక్ట్ అనిపించాయి. సినిమాలో క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు. క్లైమాక్స్ సీన్స్ కు ఆడియన్స్ షాక్ అయిపోయారు. మొత్తానికి నాగ వంశీ, కిరణ్ అబ్బవరం తాము చెప్పిన మాటను నిలబెట్టుకుని మంచి హిట్లు అందుకున్నారు. ఈ ఆనందంలో తెలుగు ఆడియన్స్ కిరణ్, నాగ వంశీ చెప్పి మరీ హిట్ కొడితే ఆ కిక్కే వేరని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.













