నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం
నాగశౌర్య కథానాయకుడిగా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ ఎస్.కోనేరు నిర్మాత. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్ నిచ్చారు. కథానాయకుడు కల్యాణ్‌రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుతూ నాగశౌర్య కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమిది. మార్చిలో చిత్రీకరణ ప్రారంభించి, ఈ ఏడాది ద్వితియార్ధంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వినోదాత్మకంగా సాగే కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్‌కి ప్రాధాన్యముంది. ఈ సినిమాతో ప్రేక్షకులు ఓ కొత్త నాగశౌర్యని చూస్తారన్నారు దర్శకుడు రాజేంద్ర.













