సినీ నిర్మాణంలోకి నాగశౌర్య
టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకడైన నాగశౌర్య ఛలో సినిమాతో రాత్రికి రాత్రి తన మార్కెట్‌ను విపరీతంగా పెంచుకున్నాడు. ఇది శౌర్య కెరీర్ కు మంచి మలుపు అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడంతో ఆ మలుపును ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. నాగశౌర్య హీరోగా నటిస్తుంటే, తన తల్లిదండ్రులు మాత్రం ఐరా క్రియేషన్స్ పేరిట బ్యానర్‌ను స్థాపించి అందులో పలు సినిమాలు నిర్మించారు.
శౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ఈ బ్యానర్‌కు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తుండగా, తల్లి ఉషా ముల్పూరి నిర్మాతగా వ్యవహరించింది. ఈ బ్యానర్ నుంచి ఛలో, నర్తనశాల, అశ్వద్థామ, కృష్ణ వ్రిందా విహారి లాంటి సినిమాలొచ్చాయి కానీ ఇప్పుడు శౌర్య పేరెంట్స్ మూవీ ప్రొడక్షన్ విషయంలో ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తోంది.
దీంతో తన సొంత బ్యానర్‌ను మరి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి రీ ఓపెన్ చేయాలని చూస్తున్నాడట శౌర్య. మొదటి నుంచి ఇండిపెండెంట్ గా ఉండే శౌర్యకు తన కెరీర్ కు సంబంధించి తానే డిసైడ్ కావాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఏ మేర నిజముందనేది తెలియాల్సి ఉంది.






