నాగశౌర్య కొత్త సొంత సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’ ఫిక్స్
నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యింది. శౌర్య హీరోగా అనీష్ కృష్ణ కాంబినేషన్లో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. షిర్లే సేతియా హీరోయిన్. నాగశౌర్య పుట్టిన రోజు కానుకాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని రిలీజ్ చేశారు. చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారి”అనే పేరుని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ కూడా చాలా కూల్ గా డీసెంట్ గా వుంది. గంగా జలం చిలకరిస్తున్నట్లు క్లాస్ గా కనిపించాడు శౌర్య. అనీష్ కృష్ణ క్లాస్ టచ్ వున్న దర్శకుడు. అల ఎలా అనే చిన్న సినిమాతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది గాలి సంపత్ చేశాడు. ఇప్పుడు శౌర్యతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని రెడీ చేస్తున్నాడు. ఇందులో సీనియర్ నటి రాధిక, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం.













