ఆ సినిమా రిజల్ట్ చాలా బాధించింది: నాగశౌర్య
ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాగశౌర్య ఆ సినిమాతో మంచి ఇమేజ్ దక్కించుకుని, తర్వాత వరుస సినిమాలు చేసి తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్లాలని చాలా గట్టిగా ట్రై చేశాడు. కానీ అతని తర్వాతి సినిమాలు శౌర్య ఆశల్ని నిరాశపరిచాయి. వరుస ఫ్లాపులతో శౌర్య మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. దీంతో శౌర్య ఆశలన్నీ తన తర్వాతి సినిమా అయిన రంగబలిపైనే పెట్టుకున్నాడు.
ఈ సినిమా కోసం శౌర్య తెగ ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా శౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను మొహమాట పడి చేసిన కొన్ని సినిమాల వల్ల తను చాలా వెనుకబడ్డానని, కొన్ని సినిమాల రిజల్ట్ రిలీజ్కు ముందే తెలుస్తోందని, రంగబలి సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నట్లు శౌర్య చెప్పుకొచ్చాడు.
అంతేకాదు, తన ఫ్లాప్ సినిమాల్లో ఒక సినిమా తనను ఎంతో బాధ పెట్టిందని, ఆ సినిమా కోసం ఎంతో కష్టపడినప్పటికీ షూటింగ్ టైమ్ లో జరిగిన తప్పుల వల్ల సినిమా బాగా ఆడదని అర్థమైనట్లు తనకు ముందే తెలిసిందన్నాడు. శౌర్య తన కెరీర్లో తన కష్టపడి చేసిన సినిమా అంటే లక్ష్యనే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. సినిమా పేరు చెప్పకపోయినా శౌర్య బాధ లక్ష్య మూవీ గురించే అని అర్థమవుతుంది.













