Naga Chaithanya: చైతూ నెక్ట్స్ కు రంగం సిద్ధం
ఎన్నో సినిమాలుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaithanya) తండేల్(Thandel) సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్ గా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం తండేల్ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మంచి జోష్ లో ఉన్న చైతన్య త్వరలోనే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టనున్నాడు.
చైతూ తన నెక్ట్స్ మూవీని విరూపాక్ష(Virupaksha) డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య కెరీర్లో 24వ మూవీగా ఇది రూపొందుతుంది. తాజా సమాచారం ప్రకారం NC24 ప్రీ ప్రొడక్షన్ తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి మూవీ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది.
మిస్టిక్ హార్రర్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో డైరెక్టర్ కార్తీక్ దండు ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడట. అందుకోసం ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర(Nagendra) ఇప్పటికే ప్రత్యేక సెట్స్ ను కూడా నిర్మిస్తున్నాడని తెలుస్తోంది. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విరూపాక్షకు సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్(Ajaneesh Lokanath) సంగీతం అందిస్తున్నాడు.













