Naga Chaithanya: పెయిడ్ పీఆర్‌పై చైతూ కామెంట్స్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో అక్కినేని నాగ చైతన్య(AKkineni Naga Chaithanya)కి పెద్దగా నెగిటివ్ ఫ్యాన్స్ ఉండరు. చైతన్య కూడా తనకు తానుగా ఏ హీరో గురించి కానీ, వారి నటన గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడడు. తన పని తాను చేసుకుంటూ సింపుల్ గా ఉండే చైతన్య తండేల్(Thandel) ప్రమోషన్స్ లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఆ పాడ్‌కాస్ట్ లో చైతన్య టాలీవుడ్ లో నెగిటివ్ పీఆర్‌ను గుర్తించినట్టు తెలిపాడు. టాలీవుడ్ లో కొంతమంది హీరోలు కావాలని నెగిటివ్ గా పెయిడ్ పీఆర్ లు చేయిస్తున్నారని, వారి టార్గెట్ వేరే హీరోల సినిమాలను నాశనం చేసి వారి గొంతు నొక్కడమేనని చైతూ వెల్లడించాడు. అయితే ఈ నెగిటివ్ పీఆర్ లు చేయిస్తుంది ఎవరనేది మాత్రం మాత్రం చైతన్య చెప్పలేదు.
అంతేకాదు, అసలు వేరే హీరోల సినిమాలను నాశనం చేయడానికి ప్రయత్నించడం వల్ల వాళ్లకేమొస్తుందో తనకు అర్థం కావడం లేదని, ఆ నెగిటివ్ పీఆర్ కు ఉపయోగించే డబ్బుని వారు తమ వర్క్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికో లేక ఏదైనా హాలిడే ట్రిప్స్ కోసమో ఎందుకు ఖర్చు పెట్టుకోరనిపిస్తుందని చైతన్య అన్నాడు. చైతూ లాంటి సాఫ్ట్ హీరో పెయిడ్ పీఆర్ గురించి ఇలా ఓపెన్ గా మాట్లాడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.













