చైతూ లైనప్ మామూలుగా లేదుగా..
కెరీర్ స్టార్టింగ్ లో కొంచెం తడబడిన చైతన్య.. ఆ తర్వాత నుంచి స్టోరీ సెలెక్షన్ లో కేర్ తీసుకుంటూ మంచి సినిమాలను చేస్తూ వస్తున్నాడు. త్వరలోనే ఆయన నుంచి లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత చైతూ, విక్రమ్ కుమార్ తో చేస్తున్న థాంక్యూ ని ఫినిష్ చేయనున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట చైతూ.
ఇది కాకుండా మరో నాలుగు సినిమాలను కూడా చైతూ లైన్ లో పెట్టాడని తెలుస్తుంది ఇంద్రగంటి డైరక్షన్ లో ఒక సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చైతూ. తరుణ్ భాస్కర్ చెప్పిన కథకు కూడా చైతూ ఓకే చెప్పాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. వీటితో పాటే గతంలో ఎప్పుడో రావాల్సిన పరశురామ్, చైతూ కాంబోలో సినిమా కూడా ముందుకు తీసుకెళ్లనున్నారట. ఎప్పుడో సర్కారు వారి పాట కంటే ముందే వీరి కాంబోలో సినిమా రావాల్సింది కానీ ఆ సినిమా వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఇక నాలుగో సినిమా కోసం వెంకీ అట్లూరి కి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది. పెద్ద బ్యానర్లు, యూత్ పల్స్ తెలిసిన డైరక్టర్లతోనే చైతూ సినిమాలను ప్లాన్ చేసుకున్న విధానం చూసి ఇప్పుడంతా ఔరా అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలతో చైతూ ఏ రేంజ్ కు వెళతాడో చూడాలి.













