చైతూ సినిమాలో మహానటి
కస్టడీ సినిమాతో డిజాస్టర్ ను అందుకున్న నాగ చైతన్య తన తర్వాతి సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాడు. ఇప్పటికే స్టోరీ పూర్తవగా, ఈ సినిమా చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్ చందూ ఈ సినిమాకు క్యాస్టింగ్ ను ఫైనలైజ్ చేస్తున్నాడట. దీని కోసం కీర్తి సురేష్ ను ఈ సినిమాలో చైతూ కి జోడీగా అనుకుంటున్నారట. దసరాలో వెన్నెల క్యారెక్టర్ ని పోలి ఉండే ఈ పాత్ర కోసం ఆమె అయితేనే సరిగా సరిపోతుందని, చైతూ పక్కన కీర్తి కూడా మంచి జోడీగా ఉంటుందనుకుంటుని ఆలోచిస్తున్నాడట చందూ.
కీర్తి డేట్స్ అడ్జస్ట్ చేస్తే మాత్రం ఆమే ఈ మూవీలో హీరోయిన్. ఈ సినిమా కోసం అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ట్రై చేస్తున్నారు. శ్రీకాకుళం లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ తో ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని లీకులందుతున్నాయి. ఈ సినిమాలో చైతూ జాలరి గా కనిపించనున్నాడని, మూవీగా తండేల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఎన్నో సినిమాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న చైతూ ఈ సినిమాపైనే తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు.













